ప్రముఖ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అఖిల్ ఎన్.ఆర్.టి భార్య మేఘా నాయర్, ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్ అనూప్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంపై గత కొద్ది రోజులుగా సాగుతున్న వివాదాలకు ఎట్టకేలకు స్వయంగా వివరణ ఇచ్చారు.
అఖిల్ వీడియోల్లో ఎప్పుడూ జంటగా కనిపించే ఈ దంపతులు హఠాత్తుగా మౌనం వహించడంతో పాటు, తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఉమ్మడి ఫొటోలు, వీడియోలను తొలగించడం నెటిజన్లలో పలు అనుమానాలకు, ఊహాగానాలకు తావిచ్చింది.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలు, పుకార్లకు చెక్ పెడుతూ మేఘా నాయర్ ఒక కొత్త పోస్ట్ ద్వారా స్పష్టతనిచ్చారు. తాను భర్త ఇంటిని వదిలి అనూప్‌తో వెళ్లిన మాట వాస్తవమేనని ఆమె బహిరంగంగా అంగీకరించారు. అయితే తానేదో మధ్యలోనే తిరిగి వచ్చేయడానికి వెళ్లలేదని, అఖిల్‌ను వదిలి వెళ్లడానికి తనకు కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయని, వాటిని బహిరంగంగా చెప్పలేనని స్పష్టం చేశారు.
అలాగే, ఇంటి నుంచి వెళ్లే సమయంలో తాను బంగారం లేదా విలువైన ఆభరణాలు వేటినీ తీసుకెళ్లలేదని, కేవలం తన వ్యక్తిగత వస్తువులను మాత్రమే తీసుకుని, నగలన్నింటినీ అక్కడే వదిలేశానని ఆరోపణలను ఖండించారు.
తాను ఇల్లు విడిచి వెళ్లిన తర్వాత పది రోజుల పాటు అనూప్ ఇంట్లోనే ఉన్నానని, ఆ సమయంలో తన తండ్రిని కలిసి మాట్లాడిన తర్వాత మళ్లీ అనూప్ నివాసానికే చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, తాము ఇద్దరం ఒకరిపై ఒకరు బహిరంగంగా ఎలాంటి ఆరోపణలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నామని, స్నేహితుల పేరుతో సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మేఘా నాయర్ కోరారు.

Leave a Reply