ప్రేమ వ్యవహారాలు: ఉత్తర ప్రదేశ్ నుండి అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళను ఆమె భర్త వదిలిపెట్టాడు. ఆ తర్వాత నికాహ్ (పెళ్లి) చేసుకుంటానని నమ్మించి మరిది తన వదినతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
ఆమెను పలుమార్లు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే, ఆ మహిళ తన మరిదిని నికాహ్ చేసుకోవాలని కోరినప్పుడు అతను మాట మార్చాడు. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే.. వదినను ప్రాణంగా ప్రేమిస్తున్నానని నమ్మించిన ఆ మరిది, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్యగా ఇంటికి తీసుకువచ్చాడు. అంతేకాకుండా, బాధితురాలైన వదినను ఇంటి నుండి బయటకు గెంసేశాడు.
దీనితో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన బాధితురాలు ఇప్పుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేస్తూ బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నైనీ గ్లాస్ స్టార్ ప్యాలెస్ వెనుక నివసించే ఒక కుటుంబానికి చెందిన వ్యక్తితో ఆమెకు నికాహ్ జరిగింది. అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే భర్త ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు.
ఆ సమయంలోనే మరిది పెళ్లి చేసుకుంటాననే అబద్ధపు వాగ్దానంతో వదినతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో 2021లో ఒక కుమార్తె, 2023లో రెండో కుమార్తె జన్మించారు. పిల్లలు పుట్టిన తర్వాత, అంతవరకు ప్రేమ నాటకమాడిన మరిది స్వరంలో మార్పు వచ్చింది. మహిళ తనను పెళ్లి చేసుకోమని అడిగితే అతను పూర్తిగా నిరాకరించాడు.
మరిది ‘జావేద్’పై పెళ్లి చేసుకోవాలని తాను ఒత్తిడి తెచ్చినప్పుడు అతను మాట తప్పడమే కాకుండా, రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత తనను, తన పిల్లలను ఇల్లు వదిలి పొమ్మని తరిమేశాడని పేర్కొంది. ప్రస్తుతం బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటూ చాలా దీనస్థితిలో కాలం వెళ్లదీస్తోంది.

Leave a Reply