హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ (Faridabad) ప్రాంతానికి చెందిన శ్యామ్‌వీర్, అతని భార్య కేశవ్ దంపతుల మధ్య.. భార్య వివాహేతర సంబంధం కారణంగా తరచూ తీవ్ర గొడవలు జరుగుతుండేవి.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య కేశవ్, తన ప్రియుడైన కామత్‌తో కలిసి భర్తను అడ్డుతొలగించుకోవాలని పక్కా పథకం రచించింది. అనుకున్న పథకం ప్రకారం ఈ నెల 16వ తేదీన శ్యామ్వీర్కు కామత్ విపరీతంగా మద్యం తాగించాడు. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్న తర్వాత, తలపై బండరాయి వేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ సమయంలో ఇంట్లో జరుగుతున్న గొడవ శబ్దాలు బయటకు రాకుండా ఉండేందుకు.. భార్య కేశవ్ ఇంటి తలుపులను బయటి నుంచి గడియ పెట్టి ఈ హత్యకు పూర్తిగా సహకరించింది.
ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులిద్దరూ కలిసి శ్యామ్‌వీర్ మృతదేహాన్ని ఇంటి సమీపంలోనే ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు రామ్‌బీర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టి అసలు నిజాన్ని రాబట్టారు. మెరుపు వేగంతో స్పందించిన పోలీసులు.. భర్తను హతమార్చిన భార్యను, ఆమె ప్రియుడిని కేవలం 24 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Leave a Reply