రాజస్థాన్ రాష్ట్రంలో మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు బ్రీత్ ఎనలైజర్ యంత్రంతో తనిఖీ చేసినప్పుడు జరిగిన ఓ ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విడుదలై వైరల్‌గా మారుతోంది.
పెట్రోలింగ్‌లో ఉన్న ఓ పోలీసు, ఆ వ్యక్తిని ఆపి ‘మద్యం సేవించారా?’ అని అడగగా.. అతడు చాలా క్యాజువల్‌గా ‘అవును, తాగాను’ అని బదులిచ్చాడు.
ఆ తర్వాత పోలీసు ‘ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని అడగ్గా.. ఆ వ్యక్తి ‘గుడికి వెళ్లి వస్తున్నాను సార్’ అని చాలా కూల్‌గా సమాధానమివ్వడం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆ తర్వాత పోలీసులు అతన్ని బ్రీత్ ఎనలైజర్ మిషన్‌లో ఊదమని చెప్పగా.. ఆ వ్యక్తి ‘మీరు ఊదమన్నారు, నేను ఊదేశాను’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
ఈ తనిఖీల్లో ఆ వ్యక్తి రెండు పెగ్‌ల మద్యం సేవించినట్లు తేలగా, ఆ మందుబాబు ఎలాంటి భయం లేకుండా ఇంత ఓపెన్‌గా మాట్లాడిన మాటలు, ఇచ్చిన ఫన్నీ సమాధానాలు ఉన్న వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

Leave a Reply