“లెక్కకు మించిన ఆస్తులను చూసి అవాక్కైన అధికారులు..!” 2.5 కిలోల బంగారం, 1.6 కిలోల వెండి, విలాసవంతమైన రిసార్ట్.. ప్రభుత్వ అధికారి ఇంట్లో జరిపిన ఆకస్మిక దాడుల్లో పట్టుబడిన కోట్ల కొద్దీ ఆస్తులు.. ‘నల్లధనం’ వెనుక ఉన్న షాకింగ్ నిజం ఏమిటి..??

మధ్యప్రదేశ్‌లో ఒక టైగర్ రిజర్వ్ (పులుల సంరక్షణ కేంద్రం) అధికారి ఇల్లు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు జరిపిన ఆకస్మిక దాడుల్లో, అతని ఆదాయానికి మించి ఏకంగా 560 శాతం మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు బట్టబయలైంది.

సత్పురా టైగర్ రిజర్వ్ (Satpura Tiger Reserve) అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ శర్మ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టు అనుమతితో పచ్‌మర్హి (Pachmarhi), ఛింద్వారా (Chhindwara) ప్రాంతాల్లో ఆయనకు చెందిన మూడు చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో సుమారు రూ. 26 లక్షల 36 వేల నగదు, రూ. 3.5 కోట్ల విలువైన రెండున్నర కిలోల (2.5 Kg) బంగారం, కిలోన్నరకు పైగా వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా, స్కార్పియో కారు, బుల్లెట్ బైక్‌తో సహా నాలుగు వాహనాలు, రూ. 50 లక్షల విలువైన లగ్జరీ గృహోపకరణాలను (Home appliances) కూడా అధికారులు సీజ్ చేశారు. ఇవి కాకుండా, సుమారు రూ. 3 కోట్ల విలువైన విలాసవంతమైన విల్లా, రిసార్ట్‌తో పాటు 28 భూ పత్రాలు (ల్యాండ్ డాక్యుమెంట్లు) కూడా సోదాల్లో పట్టుబడ్డాయి.

ఇప్పటివరకు సుమారు రూ. 7 కోట్ల 60 లక్షల విలువైన ఆస్తులను గుర్తించగా, ఆస్తుల విలువను పూర్తిగా లెక్కించే పని ఇంకా కొనసాగుతోందని, ఈ అక్రమాస్తుల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *