“వయసు 15 ఏళ్లే”.. కన్న కూతురి జీవితం నాశనమవుతున్నా చోద్యం చూసిన కసాయి తల్లి. ప్రియుడితో కలిసి అఘాయిత్యం.. ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ ఘటన..!

తిరువళ్లూరు జిల్లా ఆవడి ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

చెన్నైకి చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి ఆ బాలికపై పదే పదే లైంగిక అకృత్యాలకు పాల్పడుతూ వస్తున్నాడు.

ఈ ఘటన వెనుక వెలుగుచూసిన విషయాలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. నిందితుడు సెల్వకుమార్‌కు ఆ బాలిక తల్లితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో, కన్న కూతురిపై ప్రియుడు లైంగిక దాడి చేస్తుంటే ఆ తల్లే దగ్గరుండి సహకరించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

బాధిత బాలిక ఇచ్చిన సమాచారం మేరకు, ఆవడి ఆల్ ఉమెన్ (మహిళా) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, బాలిక తల్లితో పాటు ఈ దారుణానికి పాల్పడిన సెల్వకుమార్‌ను అరెస్ట్ చేశారు.

అరెస్టయిన ఇద్దరినీ ఆవడి మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. కన్న తల్లే సొంత కూతురిపై లైంగిక దాడికి సహకరించిన ఈ దారుణ ఘటన ఆవడి ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *