విదేశాల్లో స్థిరపడాలని ఆశపడుతున్నారా.? అయితే ఈ ఖర్చుల లెక్క చూడండి.! ఫిన్‌లాండ్‌లో నెల రోజుల జీవనానికి రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తున్న భారతీయ మహిళ. ఇంటి అద్దె మాత్రమే రూ.78,000.! కిరాణా నుంచి బస్సు ఛార్జీల వరకు ఆమె విడుదల చేసిన జాబితా చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు.!!

ఆరు నెలల క్రితం భారతదేశం నుంచి ఫిన్‌లాండ్‌కు వలస వెళ్లిన మధుమతి అనే మహిళ, అక్కడ తన నెలవారీ జీవన వ్యయాలకు సంబంధించిన పూర్తి వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది.

విదేశాల్లో జీవించడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందనే భావనల మధ్య, అక్కడి రోజువారీ ఖర్చులు ఎంత భారం అవుతాయో ఆమె పోస్ట్ కళ్లకు కట్టింది.

మధుమతి, ఆమె భాగస్వామి ఇద్దరూ కలిసి నెలకు సుమారు 1,450 నుంచి 1,500 యూరోల వరకు ఖర్చు చేస్తున్నారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ. 1.55 లక్షలు. ఇందులో ఇంటి అద్దె కోసమే 750 యూరోలు (సుమారు రూ.78,000) వెచ్చిస్తున్నారు. నీరు, విద్యుత్, మొబైల్ తదితర బిల్లులకు 115 యూరోలు, బస్సు ట్రావెల్ పాస్‌కు 110 యూరోలు ఖర్చు చేస్తున్నారు.

ఇద్దరికీ కలిపి నెలవారీ కిరాణా సరుకుల ఖర్చు సుమారు 350 యూరోలు (రూ.36,400) అవుతుందని ఆమె తెలిపింది. ఇది కాకుండా వ్యక్తిగత అవసరాలకు (Personal care) 70 యూరోలు, వినోదం మరియు ఇతర చిన్నచిన్న ఖర్చులకు 100 యూరోలు ఖర్చవుతున్నాయి. కొత్త రకాల వంటకాలను రుచి చూసేందుకు ప్రారంభంలో తరచుగా బయట తినేవారిమని, అయితే ఇప్పుడు ఇంట్లోనే వండుకుని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె చెప్పింది. ఖర్చులను కాస్త నియంత్రించుకుంటే నెలకు 1,300 యూరోలలోపు కూడా జీవనం సాగించవచ్చని ఆమె అభిప్రాయపడింది.

అయితే, ఈ లెక్కలో ఫిన్‌లాండ్‌కు వలస వెళ్లిన కొత్తలో అయిన ప్రారంభ ఖర్చులు, ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసిన మొత్తాలను ఆమె కలపలేదు. దీంతో ఆమె ఖర్చుల జాబితాపై ఇంటర్నెట్‌లో పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా, 750 యూరోల అద్దెకు ఎంత పెద్ద ఇల్లు దొరుకుతుంది, వారు హెల్సింకి (Helsinki) నగరానికి బయట నివసిస్తున్నారా అని కొందరు అడిగారు. అంతేకాకుండా, కార్ ఇన్సూరెన్స్, నిర్వహణ (Maintenance) లాంటి ఖర్చులు కూడా ఈ జాబితాలో లేవని ఎత్తిచూపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *