“వ్యక్తి ఒక్కడే.. కానీ పేర్లు మాత్రం 11..!” 30 ఏళ్లుగా పోలీసులను మోసం చేసిన 64 ఏళ్ల కేటుగాడు.. నకిలీ పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డులు.. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..!!

కేరళకు చెందిన 64 ఏళ్ల సామ్ పీటర్.. తాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో ఉన్నతాధికారినని చెప్పుకుంటూ.. పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

సామ్ పీటర్, రాహుల్ పీటర్, రాజేష్ రాబిన్సన్, రాయ్ జాకబ్ తదితర 11 వేర్వేరు పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టులు, ఇతర పత్రాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

చట్టపరమైన సమస్యలు, పన్ను వివాదాల్లో చిక్కుకున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని.. వారి కేసులను పరిష్కరిస్తానని నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సామ్ పీటర్‌పై కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో సుమారు 17 మోసం కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

2023 నుంచి కోర్టుకు హాజరుకాకుండా పరారీలో ఉన్న సామ్ పీటర్‌ను.. మంగళూరు నగర పోలీసులు సెప్టెంబర్ 1న కేరళలోని కన్నూరులో అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విస్తృతంగా విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని మోసాలు, నకిలీ పత్రాలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *