వైరల్ వార్తలు: పెళ్లి రోజు అనేది ప్రతి అమ్మాయి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు. కానీ హరిద్వార్‌కు చెందిన ఒక యువతి పెళ్లి కలలన్నీ క్షణాల్లో కల్లాకపటమయ్యాయి. అత్తారింటికి వెళ్లేటప్పుడు ఆ వధువు ఆనందానికి అవధులు లేవు.
ఎందుకంటే, ఆ అమ్మాయికి తన మనసు మెచ్చిన అబ్బాయితోనే ఇంట్లో వారు పెళ్లి చేశారు. కానీ పెళ్లయిన మొదటి రాత్రే ఆ వరుడు చేసిన పని చూసి వధువు మైండ్ బ్లాక్ అయింది.
ఈ ఘటన హరిద్వార్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ పెళ్లి తర్వాత వధువు తన భర్త మరియు అత్తమామలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. శోభనం రాత్రి తన దగ్గరకు రావడానికి బదులు, తన భర్త అమ్మాయిల మాదిరిగా మేకప్ వేసుకుంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అత్తమామలు తమను మోసం చేసి ఈ పెళ్లి చేశారని ఆమె ఆరోపించింది. హరిద్వార్ నివాసి అయిన బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది హర్యానాలోని యమునానగర్‌కు చెందిన ఒక యువకుడితో ఆమెకు వివాహం జరిగింది.
కానీ పెళ్లయిన తర్వాత తన భర్త ఒక ‘గే’ (స్వలింగ సంపర్కుడు) అని ఆమెకు తెలిసింది. పెళ్లి కోసం సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, వరుడికి విలాసవంతమైన కారును కూడా ఇచ్చామని అమ్మాయి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ పెళ్లి తర్వాత తాము మోసపోయామని గ్రహించారు. పెళ్లి తన ఇష్టప్రకారమే జరిగిందని, అయితే నిశ్చితార్థం తర్వాత తాను అబ్బాయిని కలవాలని పిలిచినా అతను నిరాకరించేవాడని బాధితురాలు తెలిపింది.
అతను ఫోన్లో కూడా చాలా తక్కువగా మాట్లాడేవాడు. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లగానే భర్త వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను అప్పుడప్పుడు మేకప్ వేసుకోవడం, అమ్మాయిల తరహాలో సైగలు చేయడం వంటివి చేసేవాడు. దీనిపై ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు కుసుమ్ కండ్వాల్ స్పందిస్తూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Leave a Reply