సూయ్ (Siuuu).! “ఫిన్ అలెన్ వికెట్ పడగానే రొనాల్డో స్టైల్‌లో సెలబ్రేషన్”. మహ్మద్ సిరాజ్ విభిన్నమైన సంబరాలు. అభిమానులను ఆకట్టుకుంటున్న వీడియో.!!!

న్యూజిలాండ్‌తో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో, వికెట్ తీసిన ఉత్సాహంలో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫేమస్ ‘సియూ’ (SIUUU) సెలబ్రేషన్‌ను మైదానంలో ప్రదర్శించి అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్‌ను కేవలం 1 పరుగుకే బౌల్డ్ చేసిన సిరాజ్, గాల్లోకి ఎగురుతూ రొనాల్డో స్టైల్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

మ్యాచ్ 22వ ఓవర్‌లో వైడ్ క్రీజ్ నుంచి సిరాజ్ వేసిన అద్భుతమైన షార్ట్-ఆఫ్-లెంగ్త్ బంతి, పిచ్ అయి లోపలికి వచ్చి ఫిన్ అలెన్ ఆఫ్-స్టంప్‌ను గిరాటేసింది. ఈ కీలక వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్ చేసిన ఈ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ముఖ్యంగా, డెన్మార్క్‌తో జరిగిన యూఈఎఫ్ఏ (UEFA) నేషన్స్ లీగ్ మ్యాచ్‌లో (నవంబర్ 14న) పోర్చుగల్ జట్టు తమ లెజెండరీ ఆటగాడు రొనాల్డోకు ప్రత్యేక గౌరవం అర్పించిన మరుసటి రోజే సిరాజ్ ఈ సెలబ్రేషన్ చేయడం విశేషంగా మారింది. ఆ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పోర్చుగల్ ఆటగాళ్లంతా రొనాల్డోకు చెందిన 7వ నంబర్ జెర్సీని ధరించి బరిలోకి దిగడం, 7వ నిమిషంలో అభిమానులు ‘SIU’ నినాదాలు చేయడం గమనార్హం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *