సౌదీ అరేబియాలోని రియాద్, దమ్మామ్ నగరాలకు నడిపే ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నవంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అలాగే, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జెడ్డా నగరానికి వెళ్లే విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది.
ఈ అకస్మాత్తు రద్దు వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఎయిర్ ఇండియా సంస్థ కీలక ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రకటించింది. దీని ప్రకారం, ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలకు అనుగుణంగా, డిసెంబర్ 8 మరియు డిసెంబర్ 14 వరకు తమ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపింది.
గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులలో ఎయిర్ ఇండియా చేసిన ఈ ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో, సౌదీ అరేబియా వెళ్లాలనుకునే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను సరిచూసుకుని, అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply