“₹2,250 కోసం స్నేహితుడికి కరెంట్ షాక్..!” మృతదేహాన్ని పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం.. 190 సీసీటీవీ కెమెరాలతో బయటపడిన నిజం.. షాకింగ్ నేపథ్యం..!!

లక్నోలోని బిజ్నోర్ ప్రాంతంలో కేవలం 2,250 రూపాయల కోసం సొంత స్నేహితుడికే కరెంట్ షాక్ ఇచ్చి దారుణంగా హత్య చేసి, దాన్ని ఓ ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

24 ఏళ్ల సచిన్, అతని స్నేహితుడు బిర్జు ఇద్దరూ కలిసి సెప్టెంబర్ 28న సచిన్ బైక్‌ను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుతో మద్యం కొనుగోలు చేసి బిర్జు గదిలో కూర్చుని తాగారు. ఈ క్రమంలో సచిన్ తీవ్రమైన మద్యం మత్తులో స్పృహతప్పి పడిపోయాడు.

అప్పుడు సచిన్ జేబులో ఉన్న మిగిలిన డబ్బును చూసిన బిర్జుకు అత్యాశ పుట్టింది. వెంటనే కరెంట్ వైరు తీసుకుని సచిన్‌కు విద్యుదాఘాతం (కరెంట్ షాక్) తగిలేలా చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సచిన్ జేబులో ఉన్న 2,250 రూపాయలు తీసుకుని, మృతదేహాన్ని తీసుకెళ్లి వేరొక ఇంటి గోడ పక్కన పడేశాడు.

దీన్ని ఏదో ప్రమాదం కారణంగా జరిగిన మరణంగా చూపేందుకు బిర్జు ప్లాన్ చేశాడు. కానీ, సచిన్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ప్రాంతంలోని సుమారు 190 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, హంతకుడైన బిర్జును పక్కాగా పట్టుకుని అరెస్ట్ చేశారు.

స్నేహితుడే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి, కేవలం 2,250 రూపాయల కోసం స్నేహితుడినే కరెంట్ షాక్ ఇచ్చి చంపిన ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని, ఆందోళనను నింపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *