కేరళ నుంచి గుజరాత్‌లోని జునాగఢ్‌కు 2100 కిలోమీటర్ల మేర లారీ నడిపే సవాలుతో కూడిన ప్రయాణం గురించి ఓ లారీ డ్రైవర్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారుతోంది.
కేరళ నుంచి అనాస పండ్లను (పైనాపిల్స్) లారీలో తీసుకెళ్తున్న డ్రైవర్ జగుబా, వాటిని కొనుగోలు చేసిన యజమాని 60 గంటల్లోగా లోడుతో చేరుకోవాలని గడువు విధించినట్లు తెలిపాడు.
నిర్ణీత సమయంలోగా రాకపోతే లక్షా 3 వేల రూపాయల అద్దె ఇవ్వబోనని బెదిరించడంతో, మధ్యలో లారీ పాడైపోయి 4 గంటలు ఆలస్యమైనప్పటికీ అతను విశ్రాంతి లేకుండా వేగంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లాడు.
అన్ని ఆటంకాలను అధిగమించి అతను ఎట్టకేలకు జునాగఢ్ చేరుకున్నప్పుడు, ఆలస్యమైనప్పటికీ యజమాని పూర్తి మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాడని జగుబా సంతోషంగా తెలిపాడు.
అయితే, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే డ్రైవర్ ప్రాణాలను పణంగా పెట్టి ఇలా కఠినమైన గడువు విధించిన సదరు యజమాని తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Leave a Reply