1947లో భారత్‌ను వీడినా హర్యానాను మరువని ప్రజలు.! పాకిస్థాన్‌లోని కరాచీలో ఒక మినీ హర్యానా.. వైరల్ అవుతున్న దృశ్యాలను చూసి భావోద్వేగానికి గురవుతున్న భారతీయులు.!!

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ‘హర్యానా కాలనీ’ అనే పేరుతో ఒక నివాస ప్రాంతం ఉండటం పలువురిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

భారతదేశంలోని హర్యానా తరహాలోనే.. అక్కడ కూడా హర్యానా ప్రజల భాష, ఆచార వ్యవహారాలు, జీవన విధానం నేటికీ అలాగే కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని చూపిస్తూ తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ రజీక్ ఖాన్, “ఇండియాలోని హర్యానాను మీరు చూసే ఉంటారు; ఈరోజు కరాచీలోని హర్యానాను చూపిస్తాం” అని చెబుతూ ఆ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ‘హర్యానా కాలనీ’, ‘హర్యానా చౌక్’ అని పిలిచే ప్రదేశాలు ఉన్నాయి. 1947లో దేశ విభజన తర్వాత అక్కడ స్థిరపడిన ప్రజలు.. తమ మూలాలను, సంప్రదాయాలను ఏమాత్రం మరువకుండా జీవిస్తున్నారు.

ఆ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి, “మా హర్యానా కాలనీ.. వివిధ వర్గాల ప్రజలు కలిసి జీవించే అందమైన పూలగుత్తి లాంటిది” అని ఎంతో గర్వంగా చెబుతున్నాడు. సరిహద్దులు విడిపోయినా, ప్రజల మనసుల్లో ఉన్న ప్రేమ, సొంత గడ్డ జ్ఞాపకాలు మారలేదని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. నేటికీ వారు హర్యాన్వి భాష మాట్లాడుతూ, తమదైన ప్రత్యేక జీవనశైలిని పాటిస్తున్నారు.

కరాచీలో ఒక్క హర్యానా కాలనీ మాత్రమే కాకుండా.. బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా వేర్వేరు నివాస ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఆయా ప్రాంతాల భాష, సాంస్కృతిక గుర్తింపులను వారు అక్కడ నేటికీ కాపాడుకుంటున్నారు. ఈ వీడియోను చూసిన ఎంతో మంది భారతీయులు.. 1947లో దేశం విడిపోయినా సొంత గడ్డ జ్ఞాపకాలను మరువని వారి జీవన విధానం తమను ఎంతగానో భావోద్వేగానికి గురిచేస్తోందంటూ కామెంట్లు పంచుకుంటున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *