“269 బంతుల్లో 200 పరుగులు బాది రికార్డు”: ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఊచకోత.. మైదానంలో పరుగుల వర్షం..!!

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ పోరులో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే క్రీజులో పాతుకుపోయి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ప్రత్యర్థి బౌలర్లను నలువైపులా చీల్చిచెండాడిన కిషన్, మైదానంలో ఫోర్ల వర్షం కురిపిస్తూ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు.

సౌత్ జోన్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఇషాన్ కిషన్.. ఒకవైపు సంయమనం పాటిస్తూనే, మరోవైపు దూకుడుగా పరుగులు రాబట్టాడు. అతడు 269 బంతులు ఎదుర్కొని 26 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 200 పరుగుల మైలురాయిని దాటి అద్భుతమైన డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్‌గా ముందుండి నడిపించిన అతడి ఈ ఇన్నింగ్స్ మ్యాచ్‌కే కీలక మలుపుగా మారింది.

ఇషాన్ కిషన్ వీరోచిత డబుల్ సెంచరీ పుణ్యమా అని ఈస్ట్ జోన్ జట్టు భారీ స్కోరు సాధించి పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ ఏకంగా 600 పరుగుల దిశగా దూసుకుపోతోంది. ఈస్ట్ జోన్ బ్యాటర్ల భారీ పరుగుల దాటికి సౌత్ జోన్ జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది.


Posted

in

by

Tags: