“4 ఏళ్లుగా వివాహేతర సంబంధం!” భర్త బతికుండగానే మరొకరితో చెట్టాపట్టాలు.. బిడ్డతో సహా సొంతూరికి వెళ్తుండగా చెలరేగిన రగడ.. నడిరోడ్డుపై ప్రియుడి దారుణ హత్య..!

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో భార్య ప్రియుడు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.

భోర్ తాలూకా పరిధిలోని సరోలా గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని అమర్ పవార్‌గా గుర్తించారు. నిందితుడు దీపక్ పాల్ భార్యతో అమర్ పవార్‌కు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వివాదమే చివరకు హత్యకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు.

ఘటనకు కొద్ది రోజుల ముందు అమర్ పవార్ సదరు మహిళను తీసుకొచ్చినట్లు సమాచారం. అనంతరం ఆమెను ఉత్తరప్రదేశ్‌లోని సొంతూరికి పంపించేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త దీపక్ పాల్, అమర్ పవార్‌ను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీయడంతో దీపక్ పాల్ దాడిలో అమర్ పవార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ హత్యోదంతానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని నిర్ధారించిన పోలీసులు, నిందితుడు దీపక్ పాల్‌ను అరెస్ట్ చేశారు.

అమిత్ జగన్నాథ్ పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్లుగా సాగిన అక్రమ సంబంధం చివరకు ప్రాణం తీసే స్థాయికి చేరడం పుణే పరిసరాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *