40 ఏళ్లు వచ్చే వరకు ఆగితే కానీ అర్థం కాలేదట ఈ జీవిత రహస్యం. 40 ఏళ్ల అనుభవాన్ని కేవలం ఒక్క నిమిషంలో చెప్పి ఆకట్టుకున్న వ్యక్తి.! “అన్నీ సర్దుకునే వరకు సంతోషాన్ని వాయిదా వేయకండి” అని చెబుతూ పలువురి కళ్లు తెరిపించిన వైరల్ వీడియో.!!

జీవితంలో అన్నీ మనకిష్టమైనట్లే జరగాలని చాలామంది కోరుకుంటారు. ఆర్థిక సమస్యలు ఉండకూడదని, ఉద్యోగంలో ఎలాంటి ఆందోళన ఉండకూడదని, బంధాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అనుకుంటాం.

కానీ, ఈ సమస్యలన్నీ తీరిన తర్వాతే సంతోషంగా జీవించాలని ఎదురుచూస్తే, ఆ రోజు అసలు వస్తుందా? అనే ప్రశ్నను లేవనెత్తుతోంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి, “నేను 40 ఏళ్లలో నేర్చుకున్న ఒక విషయాన్ని మీకు కేవలం ఒక్క నిమిషంలో చెబుతాను” అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. జీవితంలో అన్నీ సక్రమంగా ఉండే ‘సరైన సమయం’ అంటూ ప్రత్యేకంగా ఏదీ రాదు అనేది అతడు చెప్పే ముఖ్యమైన ఉద్దేశం.

మంచి ఉద్యోగం వస్తే సంతోషంగా ఉండొచ్చు, ఎక్కువ ఆదాయం వస్తే ప్రశాంతంగా జీవించవచ్చు, బంధాల్లో ఉన్న సమస్యలు తీరిపోతే జీవితం అద్భుతంగా మారుతుందని చాలామంది అనుకుంటారు. కానీ, ఆరోగ్యం బాగుంటే ఉద్యోగంలో సమస్యలు రావచ్చు; ఉద్యోగంలో ఎదుగుదల ఉంటే ఆర్థిక ఆందోళనలు కలగవచ్చు; ఆర్థిక సమస్యలు తీరితే బంధాల్లో ఇబ్బందులు రావచ్చు. ఇలా ప్రతి దశలో ఏదో ఒక సవాలు వస్తూనే ఉంటుందని ఆయన వివరించాడు.

ఒక సమస్య తీరిపోగానే మరో సమస్య రావడం అనేది జీవిత సహజ లక్షణం. కాబట్టి, బాధలన్నీ తీరిన తర్వాతే సంతోషంగా ఉండాలని అనుకోకుండా, ఇప్పుడున్న పరిస్థితుల్లోనే, ఉన్న క్షణాల్లోనే సంతోషాన్ని వెతుక్కోవాలి ఆ వ్యక్తి చెబుతున్న జీవిత పాఠం. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు, తమకు కూడా ఈ నిజం అర్థం కావడానికి చాలా కాలం పట్టిందని కామెంట్లు పెడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *