పసిఫిక్ మహాసముద్రంలో పడవ బోల్తా పడి మధ్యలో చిక్కుకుపోయిన ఐదుగురిని ఇటీవల రక్షించిన నేపథ్యంలో, చరిత్రలో నెలల తరబడి సముద్రంలో కొట్టుమిట్టాడి మృత్యుముఖం నుంచి ప్రాణాలతో బయటపడిన వారి భయానక సంఘటనలు ప్రస్తుతం మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
మెక్సికో నుంచి చేపల వేటకు వెళ్లి తుఫానులో చిక్కుకున్న జోస్ సాల్వడార్ అల్వారెంగా అనే వ్యక్తి, ఒక చిన్న ఫైబర్‌గ్లాస్ పడవలో సుమారు 13 నెలల పాటు సముద్రంలో కొట్టుమిట్టాడి, వర్షపు నీటిని తాగుతూ, పచ్చి చేపలను తింటూ తన ప్రాణాలను కాపాడుకున్నాడు.
అదేవిధంగా, 2005లో సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు మెక్సికన్ మత్స్యకారులు, తీవ్రమైన తుఫాను కారణంగా ఇంధనం అయిపోయి, దిక్కు తెలియక 9 నెలల పాటు సముద్రంలోనే సంచరించి, ఆ తర్వాత తైవాన్ నౌక ద్వారా సురక్షితంగా రక్షించబడ్డారు.
సమోవా దేశానికి చెందిన లాపాహెలె సోపి, టెలియా పా అనే ఇద్దరు ఒక చిన్న లోహపు పడవలో దారి తప్పి 4 నెలల పాటు నడిసముద్రంలో చిక్కుకుని, వర్షపు నీరు, చేపలపైనే ఆధారపడి ప్రాణాలతో పోరాడి చివరికి కొందరు గ్రామస్తుల ద్వారా రక్షించబడ్డారు.
గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం జపనీస్ కెప్టెన్ ఒగురి జుకిచి అనే వ్యక్తి సుమారు 484 రోజుల పాటు సముద్రంలో పోరాడి ప్రాణాలతో బయటపడటమే ప్రపంచంలోనే అత్యధిక కాలం సముద్రంలో జీవించిన సర్వైవల్ పోరాటంగా పరిగణించబడటంతో పాటు, ఇలాంటి సంఘటనలు మనిషి పట్టుదలకు గొప్ప నిదర్శనంగా నిలుస్తాయి.

Leave a Reply