భారతీయ వైద్య చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా, తల్లి గర్భంలో ఉన్న శిశువుకు ఓపెన్ సర్జరీ చేసి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మహా అద్భుతాన్ని సాధించారు. భారతదేశంలో ఇలా తల్లి గర్భంలోనే శిశువుకు శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి.
సుమారు 25 వారాల గర్భంలో ఉన్న ఆ శిశువుకు తీవ్రమైన వెన్నెముక లోపం (Spinal cord defect) ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బిడ్డ పుట్టకముందే సరిదిద్దాలని నిర్ణయించిన 30 మందికి పైగా నిపుణులైన వైద్యుల బృందం, తల్లి గర్భాశయాన్ని తెరిచి సుమారు 6 గంటల పాటు అత్యంత జాగ్రత్తగా, శ్రమించి ఈ సవాలుతో కూడిన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
వైద్య లోకాన్నే ఆశ్చర్యపరిచిన ఈ అరుదైన సాధన ద్వారా, పుట్టుకతోనే లోపంతో జన్మించాల్సిన బిడ్డకు నవజీవనం లభించింది. ఎయిమ్స్ వైద్యులు కనబరిచిన ఈ అద్భుతమైన ప్రతిభకు, పట్టుదలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply