గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఇండిగో విమానం మంగళవారం ఉదయం 9:16 గంటలకు యథావిధిగా బయలుదేరింది.
అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే దాని ఇంజిన్లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై, విమానాన్ని యూ-టర్న్ తీసుకుని మళ్లీ బయలుదేరిన విమానాశ్రయానికే తిప్పాలని నిర్ణయించారు.
విమానంలో ఇంజిన్ లోపం ఏర్పడిన విషయాన్ని తెలుసుకున్న విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమై, ఉదయం 9:25 గంటలకు ఎయిర్పోర్టులో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. పైలట్ నైపుణ్యం, సకాలంలో తీసుకున్న నిర్ణయం ప్రయాణికుల భద్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి.
ఎలాంటి ప్రమాదం జరగకుండా, గోవా విమానాశ్రయంలో ఉదయం 9:50 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 229 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Leave a Reply